మురికి కాలువలో మృతదేహం కలకలం

మురికి కాలువలో మృతదేహం కలకలం

విశాఖలోన మురికి కాలువలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. మారుతి సర్కిల్–ములగాడ రహదారిలో పోర్ట్ లాజిస్టిక్స్ ఎదురుగా స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక పోలీసులు ఘటనాస్థలికి చేరి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 ఉండవచ్చని, శరీరం ఉబ్బిపోయిన కారణంగా వివరాలు గుర్తించలేకపోయారని తెలిపారు.