ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
WNP: అల్లా ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలపై ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని జామ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా అంటేనే శాంతి, సహనానికి, దానగుణానికి ప్రతిరూపమన్నారు.