VIDEO: ‘ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు’
కాంగ్రెస్ గుండాలు ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద ఇవాళ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.