'బాల్యవివాహానికి ప్రయత్నిస్తే శిక్షకు అర్హులు'
E.G: కోరుకొండ మండలాల్లోని గాడాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' 100 రోజులు ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీవో డీ.సంధ్యారాణి మాట్లాడుతూ.. బాల్యవివాహాలకు సహకరించే వారిపై బాల్య వివాహ నిషేధ చట్టం-2006 ప్రకారం రెండేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.