VIDEO: కుట్టు మిషన్‌లను పంపిణీ చేసిన కేంద్రమంత్రి

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శనివారం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మహిళలకు కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి, మిషన్‌లను అందజేసింది. మహిళల అభివృద్ధి టీడీపీ లక్ష్యమని పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.