పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ELR: జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు వచ్చిన సందేహాలను వారు నివృత్తి చేశారు. మండలంలో సుమారు 25 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. యూరియాకు బదులు నానో యూరియా వాడుకోవచ్చునని రైతులకు వివరించారు.