వివాహిత ఆత్మహత్యాయత్నం.. కేసు నమోదు
CTR: బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామానికి చెందిన ఆనంద్ భార్య లక్ష్మి ఈనెల 4వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు ఆదేశాలతో బైరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.