అబాకస్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

BPT: హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి అబాకస్ పోటీల్లో బాపట్ల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా 4,000 మంది పాల్గొన్న ఈ పోటీల్లో, మంతెన కృతిక్ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం సాధించాడు. దర్శి చేతన, శేష ఆర్యాహి, భమిడిపల్లి శ్రీవైష్ణవి ఆరో స్థానంలో నిలిచి మెరిట్ ట్రోఫీలు గెలుచుకున్నారు. ఈ విజయం బాపట్ల పేరును జాతీయస్థాయిలో నిలబెట్టింది.