సిద్ధివినాయక సన్నిధిలో టీమిండియా స్టార్లు

సిద్ధివినాయక సన్నిధిలో టీమిండియా స్టార్లు

రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు ఆధ్యాత్మిక బాట పట్టారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్‌లు ప్రముఖ శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయాధికారులు వీరికి తీర్థప్రసాదాలను అందజేశారు.