14న యర్రగొండపాలెంలో మెగా జాబ్ మేళా

ప్రకాశం: ఈనెల 14వ తేదీన యర్రగొండపాలెంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో TDP ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు నేతృత్వంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు కానుంది. రాష్ట్ర నైపుణ్య సంస్థ, సీట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు.