కనకదుర్గ అమ్మవారికి జలాభిషేకం

తూర్పుగోదావరి: గోకవరంలోని దేవి చౌక్‌లో గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారికి భక్తులు జలాభిషేకం నిర్వహించారు. గోకవరంలోని పలువురు భక్తులు మహిళలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆలయాల అభివృద్ధి ప్రదాత కంబాలశ్రీనివాసరావు ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి 1008 బిందెలతో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.