ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు అరెస్టు
AKP: పాయకరావుపేట పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈనెల 11న నామవరంలో జరిగిన చోరీపై విచారణ చేపట్టగా, ఎస్సై మహమ్మద్ అలీ పీఎల్ పురం వద్ద ఆటోలో వెళ్తున్న నిందితులను పట్టుకున్నారని సీఐ అప్పన్న తెలిపారు. వారి నుంచి మూడు ట్రాన్స్‌ఫార్మర్లను స్వాధీనం చేసుకున్నారు.