చల్లపల్లిలో ఆవుకు అంతిమయాత్ర

చల్లపల్లిలో ఆవుకు అంతిమయాత్ర

కృష్ణా: చల్లపల్లికి చెందిన ప్రముఖ రైతు వేముల శ్రీనివాసరావు పెంచిన ఆవు మృతి చెందడంతో గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మేళతాళాల మధ్య, మందు గుండు సామాగ్రి పేలుస్తూ పురవీధుల గుండా అంతిమయాత్ర సాగింది. దారి పొడవునా గ్రామస్తులు పూలు సమర్పించి ఆవుకు ఘన నివాళి అర్పించారు. అనంతరం చల్లపల్లి స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.