మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

MHBD: తొర్రూరు మండలం నాంచారిమడూరు గ్రామంలోని చెరువులో అక్రమంగా మట్టి తరలింపు ప్రక్రియను నేడు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులు, ఇటుక బట్టీలకు చెరువులోని రేగడి మట్టిని తరలించేందుకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు లారీలు, ఒక జేసీబీని గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.