బాలికపై అత్యాచారయత్నం.. పోక్సో కేసు నమోదు
WGL: పర్వతగిరి మండలంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం మండలానికి చెందిన ధరావత్ సురేష్ (23) బాలికపై దాడికి యత్నించగా, ఆమె అరవడంతో అంగన్వాడీ ఆయా చేరుకుని రక్షించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ తెలిపారు.