SHOCK: మెహిఫిల్ బిర్యానీలో బల్లి

TG: HYDలో నాన్‌వెజ్ ప్రియులు బిర్యానీ తినాలంటేనే భయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం సాగర్ హైవే వద్ద మెహిఫిల్ రెస్టారెంట్‌లో కస్టమర్ చికెన్ బిర్యానీ తింటుండగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్ ఇదేమిటని రెస్టారెంట్ యజమానిని నిలదీయడంతో మంచిగా ఫ్రై అయింది తినమని చెప్పడంతో బాధితుడు షేరిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మేనేజర్‌ను పోలీసులు పీఎస్‌కు తరలించారు.