నిత్య అన్నదానానికి రూ. 50,000 విరాళం

నిత్య అన్నదానానికి రూ. 50,000 విరాళం

GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి వాసులైన భక్తులు పలగాని నరసింహారావు, శివ నాగేశ్వరమ్మ దంపతులు రూ. 50,000 విరాళం అందించారు. ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మాట్లాడుతూ.. భక్తులు ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.