రేవంత్ దేశాన్ని అవమానిస్తున్నారు: కిషన్ రెడ్డి
TG: ఎన్నికల ప్రచారంలో దేశాన్ని అవమానించేలా సీఎం రేవంత్ మాట్లాడారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సైన్యాన్ని తక్కువ చేసి చూపించేలా సీఎం వ్యవహరించారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ, రేవంత్ ఆర్మీని చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైన్యం పట్ల ఇంత దారుణంగా మాట్లాడతారా? అని నిలదీశారు.