బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: సంకినేని
SRPT: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి భారీ నిధులు తెస్తామని, ఇప్పటికే తన కృషితోనే పట్టణంలో అండర్ పాస్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.