నేటి నుంచే యాషెస్ సిరీస్
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్‌లలో ఒకటైన యాషెస్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఈ చారిత్రక పోరులో తొలి టెస్ట్ పెర్త్ స్టేడియం వేదికగా మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, చివరి యాషెస్ సిరీస్ 2023 ఇంగ్లండ్‌లో జరిగింది. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.