భాకరాపేటలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బెటాలియన్ కమాండర్ కే.ఆనంద రెడ్డి, సిద్ధవటం ఫారెస్ట్ రేంజర్ కళావతి హాజరయ్యారు. కమాండెంట్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.