ఉపాధి వేతనం పెరగాలి

VZM: ఉపాధి వేతనదారులకు అత్యధిక వేతనం వచ్చేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. రాజాంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులపై సమీక్షా సమావేశాన్ని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనం పై సమీక్షించారు. వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.