ఆకట్టుకుంటున్న 32 తలల గణనాథుడు

VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం దిగువ వీధి వేపచెట్టు వద్ద శ్రీ రామదూత యువజన సంఘం వినాయక చవితి పురస్కరించుకొని మండపంలో ఏర్పాటు చేసిన 32 తలల గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ప్రతి ఏడాది వివిధ రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారని స్థానికులు తెలిపారు.