'దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి'

SKLM: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9న చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీ నాయకులు కోరారు. శ్రీకాకుళంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీ.గోవిందరావు(సీపీఎం), కె.శ్రీనివాస్(సీపీఐ), టీ.ప్రకాష్(సీపీఎంఎల్) తదితరులు పాల్గొన్నారు.