'2 పూటల ఫొటో సిస్టం రద్దు చేసి, సౌకర్యాలు కల్పించాలి'
ASF: కాగజ్ నగర్ మండలం జవాసిగూడలో ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం కలిశారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశ పెట్టిన 2 పూటల ఫొటో సిస్టం కారణంగా కూలీలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వెంటనే దీనిని రద్దు చేసి, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.