VIDEO: దొరమామిడి జలాశయంలో ఇద్దరు గల్లంతు
ELR: బుట్టాయిగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన తుమ్మల నాగరాజు (30) తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.