నెటిజన్ల మనసులు గెలిచిన అడివి శేష్‌

నెటిజన్ల మనసులు గెలిచిన అడివి శేష్‌

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ 'మేజర్' సినిమా చేశాడు. అయితే ప్రతి ఏడాది NOV 26న మేజర్ సందీప్ తల్లిదండ్రులను శేష్ కలుస్తుండగా.. తాజాగా వారిని మీట్ అయ్యాడు. అలాగే ముంబైలోని స్మారకచిహ్నం వద్ద మేజర్‌కు నివాళులర్పించాడు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. మన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఎప్పటికీ మర్చిపోకూడదన్నాడు.