VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.