రామవరం PHCలో ఎమ్మెల్యే తనిఖీ.. సిబ్బందిపై మండిపాటు

రామవరం PHCలో ఎమ్మెల్యే తనిఖీ.. సిబ్బందిపై మండిపాటు

E.G: రామవరం PHCని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహణా లోపాలపై, సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు చాలా పేలవంగా కనిపిస్తుందన్నారు. ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకునే స్థాయిలో ఉన్నత అధికారులకు తీరికలేదన్నారు.