'ఇందిరమ్మ రాజ్యం పేదల కోసం పనిచేస్తుంది'

WNP: ఇందిరమ్మ రాజ్యం పేదల కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే తడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో మార్నింగ్ వాక్ చేప్పట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల రాలేవని, కాంగ్రెస్ హయంలో మాకు ఇళ్లు, రేషన్ కార్డులు అందాయని మహిళలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.