శ్రీనివాసులు మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

శ్రీనివాసులు మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NLR: కొండాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న చిమ్మిలి శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని స్వగృహానికి తరలించగా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెళ్లి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.