భారత్‌పై పాక్ దుష్ప్రచారానికి ఫ్రాన్స్ చెక్

భారత్‌పై పాక్ దుష్ప్రచారానికి ఫ్రాన్స్ చెక్

'ఆపరేషన్ సిందూర్‌'పై పాకిస్థాన్ మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని ఫ్రాన్స్‌ నేవీ ఖండించింది. భారత్ రఫేల్ జెట్‌లను కోల్పోయిందని, పాక్ పైచేయి సాధించిందని ఓ ఫ్రాన్స్ అధికారిని ఉటంకిస్తూ పాక్ మీడియా కథనం రాసింది. అయితే ఆ అధికారి పేరు జాక్విస్ లానే కాదని, యివన్‌ లానే అని.. రఫేల్ జెట్లు కూలినట్లు ఆయన ఎక్కడా ధృవీకరించలేదని ఫ్రాన్స్ నేవీ స్పష్టం చేసింది.