VIDEO: చీమకుర్తిలో ఘనంగా కలిశాల ప్రతిష్ఠ
ప్రకాశం: చీమకుర్తిలోని శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానంలో కలిశాల ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి గాలి గోపురం పైకి చేర్చి కలిశాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిపారు.