పుట్టపర్తి మీదుగా వందే భారత్ రైలు: ఎంపీ
సత్యసాయి: కాలాబురిగి నుంచి బెంగళూరుకు వెళ్లే వందేభారత్ రైలు పుట్టపర్తి మీదుగా నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సత్యసాయి జిల్లా ప్రజలకు మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని జిల్లా ఎంపీ పార్థసారథి తెలిపారు. తన వినతిపై సానుకూలంగా స్పందించినందుకు రైల్వే సహాయ మంత్రి సోమన్నకు ధన్యవాదాలు తెలియజేశారు.