శ్రీ గిడ్డాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.10.23 లక్షలు
కర్నూలు: పెద్దకడబూరు మండలం తారాపురంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.10,23,594 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి కుమార్ తెలిపారు. 8 నెలలకు సంబంధించిన స్వామివారి హుండీని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య లెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశామన్నారు. లెక్కింపులో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.