VIDEO: వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన బైక్

NGKL: జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా నాగునూలు శివారులో రోడ్డు కల్వర్టుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి దాటుతుండగా బైక్ కొట్టుకుపోయింది. బైకర్ కాస్త దూరం కొట్టుకుపోయి సురక్షితంగా బయటపడ్డాడు.