చెరువుల పునరుద్ధరణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్
సత్యసాయి: జిల్లాలో నీటి వనరుల సంరక్షణ కోసం ‘జలధార - జలహారతి’ కింద చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. చెరువుల్లో పూడిక తీసి నిల్వ సామర్థ్యం పెంచాలని, నీటి కాలువల్లో జంగిల్ కటింగ్ పనులు చేపట్టాలని సూచించారు.