ద్రాక్షారామంలో కురిసిన భారీ వర్షం

ద్రాక్షారామంలో కురిసిన భారీ వర్షం

కోనసీమ: ద్రాక్షారామంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుండపోతగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దాళ్వా వరి పంట చేలు ముమ్మరంగా కోతలు కోస్తున్న సమయంలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు ఎక్కడి పనులు అక్కడ నిలిపివేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుంది.