ఘన్ పూర్ రైల్వే గేట్ మూసివేత

NZB: డిచ్ పల్లీ మండలంలోని ఘన్ పూర్ - డిచ్ పల్లి మధ్య రైల్వేగేట్ ఈ నెల 21 నుంచి 24 రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే పట్టాల మరమ్మత్తుల కారణంగా గేట్ తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయం మార్గం గుండా వెళ్లాలని ఆయన సూచించారు.