పొదిలిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

పొదిలిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ప్రకాశం: పొదిలి పట్టణంలోని పలు దుకాణాలు, హోటల్స్, బేకరీలను ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే బస్టాండ్‌లో తనిఖీ చేసి సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా ఆహార పదార్థాలు అమ్మితే ఉపేక్షించమని హెచ్చరించారు.