ఆస్పరి మండల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

KRNL: ఆస్పరి మండలంలోని యాటకల్లు బ్రిడ్జ్ మరమ్మతును కోరుతూ ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మంగళవారం కర్నూలులో కలెక్టర్ రంజిత్ భాషాకు వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఆస్పరి మండలానికి తాగునీటి సమస్య అధికంగా ఉందని, తాగునీటి సమస్యను తీర్చాలన్నారు. ఉచిత ఇసుక అంటూ కూటమి నాయకులు చేస్తున్న ఇసుక అమ్మకాలపై దర్యాప్తు చేయాలన్నారు.