డ్రంక్ అండ్ డ్రైవ్.. నలుగురిపై కేసు నమోదు
GDWL: జిల్లా SP శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నగర సర్కిల్ పరిధిలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మద్యం తాగి డ్రైవ్ చేస్తే భారీ జరిమానా, ఆరు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.