ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
SDPT: చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం మండలంలోని వివిధ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, లోక రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.