VIDEO: నైట్ విజన్ డ్రోన్లతో పోలీసుల నిఘా
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం ప్రాంతాల్లో పోలీసులు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, ఓపెన్ డ్రింకింగ్, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప నిఘా ఉంచారు. ఆధునిక సాంకేతికతతో రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లలో భౌగోళిక పరిస్థితులను రికార్డు చేశారు.