VIDEO: ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం: పొన్నం
MHBD: మరిపెడ పట్టణంలో రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని చెప్పారు. పేదలకు సన్నబియ్యం, రేషన్ కార్డులు అందించామని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, ఉపాధి హామీ పథకం పేదలకు మేలు చేస్తోందని తెలిపారు.