టీటీడీ మాజీ ఛైర్మన్‌పై సంచలన ఆరోపణలు

TPT: టీటీడీ పాలకమండలి భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తోందని, కల్పించిన సౌకర్యాలపై 98% భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు బుధవారం తెలిపారు. అయితే, టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆయన తీవ్రంగా విమర్శించారు. వైసీపీ హయాంలో రోజుకు వేలాది దర్శన టికెట్లు అమ్మకానికి పెట్టారని, ప్రతి ఫైల్‌లో అవినీతి జరిగిందని ఆరోపించారు.