వణికిస్తున్న చలి.... ఇబ్బంది పడుతున్న ప్రజలు

వణికిస్తున్న చలి.... ఇబ్బంది పడుతున్న ప్రజలు

NZB: జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పాలు, కూరగాయల విక్రయదారులు, పారిశుధ్య కార్మికులు, రైతులు చలితో వణికిపోతున్నారు. డిసెంబరు 7 నుంచి 16 వరకు శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మూడు రోజులుగా 16 డిగ్రీల నుంచి 13 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.