బస్సు ప్రమాదానికి కారణం వాళ్లే: ఎంపీ
TG: చేవెళ్ల బస్సు ప్రమాదంపై MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. '2016లో బీజాపూర్ జాతీయ రహదారి ప్రకటించారు. రియల్ ఎస్టేట్ కోసం నాటి BRS ప్రభుత్వం భూసేకరణ చేయలేదు. కేవలం వారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి కారణం BRS ప్రభుత్వమే. BRS రియల్ ఎస్టేట్ దాహానికి ప్రజలు బలి అవుతున్నారు' అని అన్నారు.