VIDEO: ఇంటి పెరట్లో గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్
ASF: కెరెమెరి మండలం బీమాన్ గొందిలో గంజాయి సాగు చేస్తున్న గోయేగం గ్రామానికి చెందిన సిడం రాజు తన ఇంటి పెరట్లో 5 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు ఆదివారం పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ. 50,000గా ఉందని SI మధుకర్ తెలిపారు. గంజాయి సాగు, వినియోగం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.