మహిళా సమాఖ్యలకు ఎలక్ట్రిక్ బస్సులు
HYD: గ్రేటర్ పరిధిలో వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు HYD, RR, MDCL జిల్లాల్లోని మహిళా సమాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ఇవ్వనుంది. ఒక బస్సు కొనుగోలుకు రూ. 36 లక్షలు గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా మహిళా సమాఖ్యలకు ఇవ్వగా.. మిగిలిన రూ. 6 లక్షలను సమాఖ్య ప్రతినిధులు తమ పొదుపు ఖాతాల నుంచి ఇచ్చారు. తొలి విడతలో RR జిల్లాలో 15, MDCL జిల్లాలో 4 బస్సులను సమకూర్చనున్నారు.